ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినప్పటికీ కార్యాచరణ ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఫిబ్రవరి 8న సామూహిక ఆమరణ నిరాహార దీక్ష - SC CORPORATION EX CHAIRMAN Pidamarthi ravi
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయలని కోరుతూ ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో 5వేల మందితో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం ఇప్పటికీ చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఫిబ్రవరి 8న సామూహిక ఆమరణ నిరాహార దీక్ష
వర్గీకరణ కోసం ఇంతకాలం ఎన్నో ఉద్యమాలు చేశామని ఇక తమ సహనం నశించిందని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 8వ తేదీన 5 వేల మందితో హైదరాబాద్‌లో సామూహిక ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: పుర పోలింగ్‌కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు
TAGGED:
SC VARGIKARANA BILL DIMAND