వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో ఎస్బీఐ ఏటీఎంను అధికారులు తిరిగి ప్రారంభించారు. నోట్ల రద్దు సమయంలో ఇక్కడ ఉన్న రెండు ఏటీఎంలను మూసేశారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు రైలు ప్రయాణికులు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి తాము వచ్చిన రైలు నుంచి కిందకు దిగి రైలును ఎక్కలేక కాజీపేటలోనే ఉండిపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు బ్యాంకులకు ఏటీఎం సౌకర్యం కల్పించాలని కోరడం వల్ల ఏటీఎంను తిరిగి ప్రారంభించారు.
కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఏటీఎం పున:ప్రారంభం - కాజీపేట రైల్వేస్టేషన్
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఎస్బీఐ ఏటీఎం బుధవారం పునఃప్రారంభమైంది. నోట్ల రద్దుతో మూసేసిన వాటిని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు తిరిగి ప్రారంభించారు.
![కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఏటీఎం పున:ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3679446-thumbnail-3x2-atmgupta.jpg)
కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఎస్బీఐ ఏటీఎం