సేవ్ గర్ల్చైల్డ్ నినాదంతో మట్టి గణపతి దర్శనం - SAVE GIRL CHILD MATTI GANAPATHI
వరంగల్ యువకులు సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.
నవరాత్రులు అంటే గణపతి మండపాల్లో పూజలు, అర్చనలతో భక్తి పారవశ్యం విరాజిల్లుతూ ఉంటుంది. కానీ అమ్మాయిని కాపాడుకుంటే అమ్మను కాపాడుకోగలమనే ఉద్దేశంతో 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హమారా హిందుస్థాన్ యూత్ సభ్యులు 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదాన్ని ఎంచుకుని తమ ఉద్దేశం ప్రతిమలో కనిపించే విధంగా ప్రత్యేకంగా మట్టి గణపతిని తయారు చేశారు. ఏటా ఏదో ఒక నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.