వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫపూర్‌లో గ్రామపంచాయతీ మంచినీళ్ల బావి నీటిని గ్రామ సర్పంచ్ పొలానికి వాడుకోవడం వివాదానికి దారి తీస్తోంది. అసలే ఓవైపు వేసవికాలం ప్రారంభమై నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తరుణంలో... ప్రజలకు తాగునీరు లేకుండా పంచాయతీ మోటర్‌కు పైపు బిగించి నీళ్లు మళ్లించడంపై గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని, అధికారులను సంప్రదించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ నీరు సర్పంచ్ పంటపొలాలకు తరలింపు.. - తెలంగాణ వార్తలు
అసలే ఎండాకాలం. తీవ్రమైన నీటి కొరత. ఈ సమయంలో గ్రామంలో రోజూ మంచినీటి సరఫరా చేయాలి. కానీ ఓ సర్పంచ్ మాత్రం పంచాయతీ మంచినీళ్ల బావి నీటిని యథేచ్చగా తన పంటపొలాలకు వాడుకుంటున్నాడు. గ్రామానికి తాగునీటి కోసం 15 రోజులకొకసారి నల్లా నీరు వదులుతున్నాడు. ఈ సర్పంచ్ తీరుపై విసిగిపోయిన గ్రామస్థులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
గ్రామపంచాయతీ నీటిని సొంత అవసరాలకు వాడుకుంటున్న సర్పంచ్, వరంగల్ అర్బన్ జిల్లా
గ్రామస్థులకు 15 రోజులకు ఒకసారి నల్లా నీళ్లు ఇస్తూ... పంచాయతీ మోటార్ నీటిని సర్పంచ్ రొంటల ప్రభాకర్ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ చర్యలపై భీమదేవరపల్లి మండల వైస్ ఎంపీపీ మాడుగుల ఏజ్రా ఆందోళన వ్యక్తం చేశారు. మంచి నీళ్ల బావి నుంచి ఇష్టారాజ్యంగా తన పొలానికి నీళ్లు మళ్లించిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:బానిసగా చూశాడు.. బయటకొచ్చేశా..!