తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో గణనాథునికి సప్తవర్ణాభిషేకం - పూజ ఎలా చేయాలంటే

ఓరుగల్లులో స్వయంభూ శ్రీశ్వేతార్క మూల గణపతి దేవాలయంలో గణనాథునికి ఏడు రంగుల ద్రావణాలతో అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

'ఓరుగల్లులో గణనాథునికి సప్తవర్ణాభిషేకం'

By

Published : Oct 18, 2019, 8:24 AM IST

Updated : Oct 18, 2019, 4:51 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​లోని స్వయంభూ శ్రీశ్వేతార్క మూల గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఏడు రకాల ద్రావణాలతో గణపతికి సప్తవర్ణాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు దూరప్రాంత భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి ప్రతిమను పురవీధుల్లో ఊరేగించారు.

'ఓరుగల్లులో గణనాథునికి సప్తవర్ణాభిషేకం'
Last Updated : Oct 18, 2019, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details