తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలకు సినిమాలూ, పిక్నిక్కులు.. వారికి నేనున్నానంటున్న సంతోష్ - సులక్ష్య సేవా సమితి

కడుపు నిండా అన్నం పెట్టి అనాథల ఆకలి తీర్చే వాళ్లు, నిజంగా గొప్పవాళ్లే. కానీ.. అంతటితోనే సంతృప్తి చెందక, వారి సంతోషానికి పాటు పడుతూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు సంతోష్ కుమార్. స్నేహితుల సాయంతో హనుమకొండలో ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు చేస్తూనే అనాథ పిల్లలను విహార యాత్రలకు తీసుకువెళ్లి వారికి వినోదం అందిస్తున్నాడు.

Charity Organization
Charity Organization

By

Published : Nov 20, 2022, 12:25 PM IST

'సులక్ష్య సేవా సమితి'.. అనాథలకు అండ: సంతోష్ కుమార్‌

లోకంలో నా అన్నవారెవరూ లేకపోవడానికి మించి మరో వేదన ఉండదేమో. ప్రభుత్వంతో పాటు ఎంతో మంది దాతలు.. స్వచ్చంద సంస్థలు వీరికి తోడ్పాటు అందిస్తూ సాయంగా నిలుస్తున్నారు. అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. కానీ ఇవి మాత్రమే సరిపోతాయా అంటే కాదనే చెప్పాలి. మిగతావారిలాగా వీరికీ సరదాగా గడపాలని, సినిమాలకు, షికార్లకు వెళ్లాలని ఉంటుంది. కానీ, తీసుకువెళ్లేవారెవరూ ఉండరు. అలాంటి వారందరికీ నేనున్నా అంటూ ముందుకొస్తున్నాడు హనుమకొండకు చెందిన సంతోష్.

ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూనే తన స్నేహితులతో కలిసి 2013లో "సులక్ష్య సేవా సమితి" అనే స్వచ్ఛంద సంస్థను స్ధాపించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనాథలకు, వృద్ధులకు తమ వంతు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ పాఠశాలల దత్తత, మౌలిక వసతుల ఏర్పాటు, మొక్కలు నాటడం, సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన, సివిల్ సర్వీస్ ర్యాంకర్లతో అవగాహన సదస్సులు చేపట్టి ఎన్నో పురస్కారాలు పొందాడు. పిల్లలందరినీ వరంగల్ జూ పార్క్​కు తీసుకువెళ్లి సంతోషంగా గడిపేలా చేశాడు. ఇక ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సీటీ అందాలను పిల్లలకు చూపించి.. వారితో పాటూ తానూ ఉల్లాసంగా గడిపాడు. ఇది మరిచిపోలేని అనుభవమని అంటున్నాడు. విహార యాత్రల ద్వారా పిల్లల ముఖాల్లో కనిపించే ఆనందం ముందు మరేదీ సాటిరాదని సంతోష్ చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details