సంక్రాంతి పర్వదినం సందర్భంగా వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పతంగుల పండుగను గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ వి. రవీందర్ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులకు రంగురంగుల గాలిపటాలను అందించారు.
ఓరుగల్లులో ఉత్సాహాంగా పతంగుల పండుగ... - ఓరుగల్లులో ఉత్సాహాంగా పతంగుల పండుగ...
సంక్రాంతి పండుగ సందర్భంగా ఓరుగల్లులో పతంగుల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
![ఓరుగల్లులో ఉత్సాహాంగా పతంగుల పండుగ... sankrathi-celabrations-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5707300-thumbnail-3x2-kee.jpg)
ఓరుగల్లులో ఉత్సాహాంగా పతంగుల పండుగ...
చైనా మాంజా వాడకుండా, ప్రమాదాలకు లోనుకాకుండా గాలిపటాల పండుగను ఆనందంగా జాగ్రత్తంగా జరుపుకోవాలని అతిథులు ఆకాంక్షించారు. బయటకు వచ్చి అందరితో సరదాగా పతంగులతో ఆడటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఇటు మహిళలు... రంగవల్లుల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఓరుగల్లులో ఉత్సాహాంగా పతంగుల పండుగ...