మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహించారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడం వల్ల చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపారు. వేకువజాము నుంచే పిల్లలను వెంట తీసుకొని ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులకు పలకపై అక్షరాలను రాయించారు. మూలా నక్షత్రం రోజున చిన్నారులకు అక్షర అభ్యాసం జరిపిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుందని అర్చకులు తెలిపారు.
శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం - అక్షరాభ్యాసం
సరస్వతీ దేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు భారీగా తరలొచ్చారు.
శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం