బతుకమ్మ పూల కొనగోళ్లతో కిటకిటలాడుతున్న ఓరుగల్లు - బతుకమ్మ పూల కొనగోళ్లతో కిటకిటలాడుతున్న ఓరుగల్లు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా పూల కొనుగోళ్లదారులతో మార్కెట్లో సందడి నెలకొంది.
బతుకమ్మ పూల కొనగోళ్లతో కిటకిటలాడుతున్న ఓరుగల్లు
సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆడపడుచులు పూల సేకరణలో నిమగ్నమయ్యారు. బతుకమ్మ పండుగ కోసం రకరకాల పూలు అమ్మేందుకు వచ్చిన విక్రయదారులతో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం సందడిగా మారింది. సద్దుల బతుకమ్మను పేర్చేందుకు కావాల్సిన తంగేడుపూలు, గునుగు, తామర పూలు, చామంతి, సీత జడలు, రంగులు కొనేందుకు ప్రజలు ఉత్సాహం కనబర్చారు. హన్మకొండ చౌరస్తా, పబ్లిక్‌గార్డెన్, తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.