తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహానికి ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం - RTC workers' plea for Ambedkar statue

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందజేశారు.

అంబేడ్కర్ విగ్రహానికి ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం

By

Published : Oct 7, 2019, 7:29 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. మూడో రోజు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్​లో ఆర్టీసీ కార్మికులు సమావేశమై ధర్నా నిర్వహించారు. మూడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు భాజపా, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. అయితే ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

అంబేడ్కర్ విగ్రహానికి ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details