వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ఏడో రోజు సమ్మె కొనసాగుతోంది. మొత్తం 9 డిపోల పరిధిలోని బస్సులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 942 బస్సులకు.. 604 రోడ్డెక్కినట్లు అధికారులు తెలిపారు. దసరా పండుగకు వచ్చిన వారంతా తిరుగుపయనమవ్వడం వల్ల బస్టాండ్లలో రద్దీ నెలకొంది. వరంగల్-హైదరాబాద్ రూట్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్థానిక భాజపా నేతలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు.
సమ్మె కార్యచరణపై ఆర్టీసీ ఐకాస నేతల భేటీ - rtc strike at warangal
సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు వరంగల్ ఆర్టీసీ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

సమ్మె కార్యచరణపై ఆర్టీసీ ఐకాస నేతల భేటీ