తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయం

గ్రేటర్ వరంగల్ నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. గుంతల మయమై, కంకర తేలిన రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి.  హన్మకొండ బస్టాండ్​కు వచ్చే రహదారులన్నీ  గోతులమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయం

By

Published : Jul 11, 2019, 3:29 AM IST

ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయం

వరంగల్​ నగరంలో గుంతలమయమైన రహదారులు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కంకర తేలిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమైపోతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి. జిల్లా ప్రధాన కేంద్రంలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి అర్థంచేసుకోవాలి. స్మార్ట్​సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పుకొస్తున్న నేతలు కనీసం రోడ్లను కూడా బాగుచేయడం లేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

పట్టించుకునేవారే కరవయ్యారు

రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరవయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదంటూ విమర్శిస్తున్నారు. వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకునైనా సరే.. అధికారులు వేగంగా మరమ్మతులు చేపట్టాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం చట్టవ్యతిరేకం కాదు'

ABOUT THE AUTHOR

...view details