రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, కొడుకు శాంతన్, బావ రాజు, అక్క పద్మజతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ... తిరిగిరాని లోకాలకు - Road Accident Rangareddy district
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన ఒకే కుంటుంబ సభ్యలు శ్రీశైలం దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ... తిరిగిరాని లోకాలకు