తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ.. దంపతులు మృతి - రోడ్డు ప్రమాదం

రోడ్డు దాటుతున్న దంపతులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా రాంపూర్ స్టేజ్‌ వద్ద జరిగింది. ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.

road accident in warangal urban district
వరంగల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

By

Published : Apr 18, 2020, 12:19 PM IST

Updated : Apr 18, 2020, 12:36 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ స్టేజ్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్​కు చెందిన నాయిని ఐలయ్య, వెంకటలక్ష్మి దంపతులు. ఈ రోజు బ్యాంకుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. రోడ్డు దాటుతున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సిసి కెమెరాల సహాయంతో వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ.. దంపతులు మృతి
Last Updated : Apr 18, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details