Road accident two dead: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సమీపంలోని 365 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు సంవత్సరాల పాప పూర్ణిమ అక్కడికక్కడే మృతి చెందగా తాతా ధారావత్ పాట్యాను వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అతని భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఆసుపత్రి నుంచి తిరిగొచ్చే మార్గంలో అనంతలోకాలకు.. - వరంగల్ జిల్లా ఇటికాలపల్లిలో రోడ్డు ప్రమాదం
Road accident two dead: సాధారణంగా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. మృత్యువు ఏ రూపంలోనైనా దాడి చేయవచ్చు. అనారోగ్యానికి గురైన మూడేళ్ల పాపను ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఇంటికి తిరిగివచ్చేటప్పుడు ఆ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబళించింది.
ఆకుల తండా గ్రామానికి చెందిన ధారావత్ పాట్యా- భార్య లక్ష్మి తన మనవరాలు పూర్ణిమకు జ్వరం రావడంతో ఇటికాల పల్లి గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు ఎక్స్ఎల్ వాహనంపై తీసుకెళ్లి ఆస్పత్రిలో చూపించారు. తిరిగి వస్తుండగా మల్లంపల్లి నుంచి మట్టి లోడుతో వస్తున్న ఎంహెచ్ 34 బీజీ 9699 నంబరు గల లారీ ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంపై ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన తాత మనవరాలు మృతి చెందడంతో వారి స్వగ్రామం ఆకుల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి :