KMC Corona: హనుమకొండ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఐదురుగురు విద్యార్థులకు వైరస్ పాజిటివ్ వచ్చింది. శనివారం కాకతీయ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పరీక్షలు చేయగా... వారిలో 17 మందికి పాజిటివ్‌గా గుర్తించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
KMC Corona: కేఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో ఐదుగురికి పాజిటివ్ - Kakatiya medical college corona news
16:11 January 09
మరో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్
వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా... మరికొందరు హాస్టల్‌లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లోనే హనుమకొండలో 99, మహబూబాబాద్‌లో 75 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా...
Telangana Corona: రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,156 పరీక్షలు నిర్వహించగా... 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,041కి చేరింది.
ఇవీ చూడండి: