తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస ఎమ్మెల్యేలు రియల్ఎస్టేట్​ ​బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు..' - rythu rachabanda programme at akkampeta

REVANTH REDDY: ప్రొఫెసర్​ జయశంకర్​ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ కాలగర్భంలో కలిపేయాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. 8 ఏళ్ల తెరాస హయాంలో జయశంకర్ స్వగ్రామం అక్కంపేట.. కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా మారలేదని విచారం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్కంపేటను దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

REVANTH REDDY
REVANTH REDDY

By

Published : May 21, 2022, 5:13 PM IST

Updated : May 21, 2022, 8:45 PM IST

REVANTH REDDY: తెలంగాణ స్ఫూర్తిప్రదాత ఆచార్య జయశంకర్ స్వగ్రామాన్ని అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన పేరును కాలగర్భంలో కలిపేయాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 'రైతు రచ్చబండ' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడారు.

8 ఏళ్ల తెరాస హయాంలో.. అక్కంపేట కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా మారలేదని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇక్కడి కాలనీల్లో సమస్యలు హృదయవిదారకంగా ఉన్నాయన్నారు. ఎలాంటి సౌకర్యాలకూ వారు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంట బీమా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న రేవంత్​రెడ్డి.. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తలచుకుంటే 10 నిమిషాల్లో కేసీఆర్ గఢీని నేలమట్టం చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రైతులు ఎక్కడా చేయి చాచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీలను అమలు చేసి.. వారికి అండగా నిలుస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే.. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు.. ఆచార్య జయశంకర్, అంబేడ్కర్​ విగ్రహాలకు రేవంత్​రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అక్కంపేట గ్రామస్థులతో మాట్లాడి.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వరంగల్ డిక్లరేషన్ కరపత్రాలు ఇచ్చి.. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు ఏమేం చేసేది వివరించారు. ఓ రైతు కుటుంబంతో కలసి భోజనం చేశారు.

పార్టీ నేతలతో కలిసి రైతు ఇంట్లో భోజనం చేస్తున్న రేవంత్​రెడ్డి

రైతు చనిపోతే బీమా వర్తింపజేస్తున్న తెరాస ప్రభుత్వం.. పంటలు నష్టపోతే పరిహారం ఎందుకివ్వట్లేదు. ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితులు, అణగారిన వర్గాల బతుకులు మారలేదు. వచ్చే ఏడాదిలో కాంగ్రెస్​ గద్దెనెక్కుతుంది. అప్పుడు అన్నదాత చేయి చాచి అడిగే అవసరం లేకుండా చేస్తాం. తలెత్తుకుని బతికేలా చేస్తాం. అక్కంపేటను దత్తత తీసుకుంటాం. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

REVANTH REDDY: 'కాంగ్రెస్​ ప్రభుత్వంలో అన్నదాత తలెత్తుకుని బతికేలా చేస్తాం'

అనంతరం వరంగల్ జిల్లా కొత్తపేటలో ల్యాండ్​ పూలింగ్​లో భూములు కోల్పోతున్న రైతులను రేవంత్​రెడ్డి పరామర్శించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జీవో నెంబర్​ 80(ఏ)ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. రైతులకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. భూముల కోల్పోతున్న వారికి ధైర్యం చెప్పిన రేవంత్.. ల్యాండ్ పూలింగ్​ ఉప సంహరణ కోసం రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.

స్థానిక శాసనసభ్యులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెం. 80(ఏ)ను రద్దు చేయాలి. 27 గ్రామాల్లో సుమారు 22,500 ఎకరాల వ్యవసాయ భూములను ప్రభుత్వం కొల్లగొట్టేందుకు చూస్తుంది. రైతులు జాగ్రత్తగా ఉండాలి. పల్లెల్లో తీర్మానం చేసుకున్న వాటిని రాష్ట్రపతికి త్వరలో అందిస్తాం. అవసరమైతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం.-రేవంత్​రెడ్డి

ఇవీ చూడండి..

జనంలోకి వరంగల్ డిక్లరేషన్... నెల రోజుల పాటు రైతు రచ్చబండ

'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'

Last Updated : May 21, 2022, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details