వరంగల్ జిల్లాలో నిరుపేద విద్యార్థులైన అన్నాచెల్లెలు ఎంబీబీఎస్ సీట్లు సాధించి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై హనుమకొండకు చెందిన ఆయాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అన్వర్ స్పందించారు. తక్షణ సహాయంగా రూ.50 వేల చెక్కును వారికి అందజేశారు. సానియాను దత్తత తీసుకొని వైద్యవిద్యకు మొత్తానికి అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని ఆయన తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని అన్వర్ అన్నారు. మరో ముగ్గురు దాతలు రూ.30వేలు విద్యార్థులకు అందించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఎంబీబీఎస్ సీట్లు సాధించిన అన్నాచెల్లెలుకు ఆర్థిక సాయం - వరంగల్ తాజా వార్తలు
నిరుపేద విద్యార్థులైన అన్నాచెల్లెలు ఎంబీబీఎస్ సీట్లు సాధించి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై హనుమకొండకు చెందిన ఆయాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అన్వర్ స్పందించారు. తక్షణ సహాయంగా రూ.50 వేల చెక్కును వారికి అందజేశారు.
గత సంవత్సరం కరోనాతో తండ్రి చనిపోయినా అధైర్యపడకుండా పిల్లలు షేక్ సోయబ్, సానియాలు కష్టపడి చదవి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. అయితే ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తల్లితో కలిసి దాతల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సానియాకు కాకతీయ మెడికల్ కళాశాలలో సీటు రాగా, షేక్ షోయబ్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. తన పిల్లలను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది తల్లి జహీరా బేగం.
ఇదీ చదవండి: ఎంబీబీఎస్ సీట్లు సాధించినా... కలచివేస్తున్న ఆర్థిక కష్టాలు