వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా నగరంలోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్దమ్మగడ్డ ప్రాంత వాసులు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు.
ఎమ్మెల్యేతో వాదనకు దిగిన పెద్దమ్మగడ్డ వాసులు - ఎమ్మెల్యే వినయ భాస్కర్ వాదనకు దిగిన పెద్దమ్మగడ్డ వాసులు
వరంగల్ పట్టణంలోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిలో ముదిరాజ్ భవనాన్ని నిర్మిస్తున్నామన్న వార్తలో నిజం లేదని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ భాస్కర్ తెలిపారు. నగరంలోని పెద్దమ్మగడ్డలో పలు అభివృద్ధి పనులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యేతో వాదానికి దిగిన పెద్దమ్మగడ్డ వాసులు
పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ఎస్సీలు అధికంగా నివసిస్తున్నారన్న స్థానికులు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎస్సీ భవన్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందిచిన ఎమ్మెల్యే కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడి ప్రభుత్వ భూమిలో ముదిరాజ్ భవనాన్ని నిర్మించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని తాను మంత్రుల దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల కన్నుమూత