వివిధ జబ్బులతో వైద్యం కోసం వచ్చిన రోగులకు కొత్త రోగం తెచ్చేలా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని గాంధీ విగ్రహం చుట్టూ, పక్కనే గార్డెన్‌లో పెరిగిన వయ్యారి భామ మొక్కలతో కలిగే నష్టాలను వివరిస్తూ గురువారం ‘ఈనాడు- ఈటీవీ భారత్’లో ‘ఎంజీఎంలో వయ్యారి భామలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వీటిని తొలగించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వయ్యారి భామ మొక్కల తొలగింపు.. - Removal of weeds in warangal mgm hospital
ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. వరంగల్ ఎంజీఎంలో గార్డెన్‌లో వయ్యారి భామ మొక్కలు విస్తరిస్తూ... కొవిడ్రోగులకు కొత్త రోగం వచ్చేలా ఉన్నాయి. దీనిపై ఈటీవీ భారత్ రాసిన కథనానికి అధికారులు స్పందించి మొక్కలను తొలగించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వయ్యారి భామ మొక్కల తొలగింపు..
ఆసుపత్రిలోని వివిధ బ్లాకుల్లో పెరిగిన ఈ కలుపు మొక్కలను పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు.
ఇదీ చూడండి:వీధిలో విడిచిపెట్టిన కొడుకు... దీనంగా ఎదురుచూస్తున్న తల్లి