వరంగల్ అర్బన్ జిల్లా శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఓ వింత ఘటన జరిగింది. దాదాపు వారం పది రోజుల క్రితం ఆలయ దక్షిణ ద్వారం గుండా ఎరుపు రంగులో వింత ద్రావణం కారినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని... మాకే ఇది ఒక వింతలా ఉందని అన్నారు.
Inavolu temple: ఐనవోలు ఆలయంలో వింత ద్రావణం.. ఆశ్చర్యంలో అర్చకులు - ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో వింత ఘటన
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఎరుపు రంగు ద్రావణం కారింది. అసలు ఆ ద్రావణం ఎలా, ఎందుకు కారిందో అర్థం కాక ఆలయ అర్చకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఐనవోలు ఆలయంలో వింత ద్రావణం.. ఆశ్చర్యంలో అర్చకులు
దేవాదాయ శాఖ అధికారులు స్పందించి దక్షిణ ద్వారం గుండా వస్తున్న వింత ద్రావణాన్ని పరీక్షించాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు. అసలు ఆ ద్రావణం దేవుని మహిమ వల్ల వస్తుందా... లేదా ఏదైనా సాంకేతిక సమస్య వల్ల వస్తుందో తెలుసుకోవాలని అంటున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వింత ఘటన ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చూడండి:నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!