వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ పెరుగుతూ.. రైతుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. కొత్త మిర్చి రాకతో మిర్చి యార్డు కళకళలాడుతోంది. కొత్త మిర్చి ధరలు రికార్డు స్థాయి పలుకుతున్నాయి. తేజ రకం ఏకంగా రూ. 18 వేల 3 వందల గరిష్ఠానికి చేరింది. వండర్‌హాట్ రకం రూ. 11 వేలు పలకగా.. యూఎస్ 341 రకం రూ. 14 వేలకు పలుకుతోంది. ప్రస్తుత ధరలతో సంతోషంగా ఉందని మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు మార్చి వరకూ ఇలాగే కొనసాగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు - ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో కొత్త మిర్చి ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ధరల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు