Record price for Red chilli in Telangana :ఎర్ర బంగారంగా పిలిచే మిరప.... బంగారం కంటే... అధికంగా ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో.... దేశీ మిర్చిలో టమాటా రకానికి క్వింటా 80 వేల వంద రూపాయల ధర పలికింది. ఖమ్మం నుంచి వచ్చిన రైతు....ఈ ధరను కైవసం చేసుకున్నాడు. గతేడాది 90 వేలు పలికినా...ఈ సీజన్‌లో కొత్త మిర్చికి ఈ స్థాయి ధర రావడం ఇదే తొలిసారి.
pests threat to red chilli crop : వండర్ హాట్ రకానికి 37 వేలు, తేజ రకానికి 20 వేలు, US 341 రకానికి 26 వేల రూపాయల ధర క్వింటాకు పలుకుతోంది. నాణ్యతలో పేరెన్నిక గన్నది కావటం, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో టమాటా రకానికి డిమాండ్ ఉండటంతో... అధిక ధర నమోదవుతోంది. మార్కెట్‌కు వచ్చే మిర్చి తేమ లేకుండా చూసుకుంటే... మరింత ధర వస్తుందని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.
"టమాట రకం మిర్చికి రూ.80వేల రికార్డు ధర పలికింది. ఈ రకం ఎక్కువగా పచ్చళ్లు పెట్టడానికి ఉపయోగిస్తారు. ఈ పచ్చళ్లు విదేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఈ మిర్చి ఈ ఏడాది తక్కువగా పండింది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంది." - రాహుల్, ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి
pests threat to red chilli in telangana : మార్కెట్లో మంచి ధర ఉందని సంతోష పడాల్సిన రైతులకు... పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు.....కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. నల్ల తామర , నల్లి తెగుళ్లు మళ్లీ విజృంభిస్తున్నాయి. పూత, పింద రాలిపోవడంతో... కాయలు రావట్లేదు.