తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలి... లేదంటే రోడ్డున పడుతాం' - telangana news

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట స్థిరాస్తి వ్యాపారులు ధర్నాకి దిగారు. ఎల్ఆర్​ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని... లేదంటే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు.

real-estate-business-merchants-protest-at-kazipet-in-warangal-urban-district
'ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలి... రోడ్డున పడుతాం'

By

Published : Dec 17, 2020, 5:28 PM IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలతో పాటుగా వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్​కి సంబంధించి ధరణి పోర్టల్ అసంపూర్ణంగా ఉందని వారు ఆరోపించారు. పూర్తి స్థాయిలో ధరణిని అభివృద్ధి చేసే వరకు పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని కోరారు.

కనీసం మరో 6 నెలల వరకైనా పాత పద్ధతిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తామంతా కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారులు వాపోయారు. ఎల్​ఆర్​ఎస్​, ధరణి పోర్టల్ పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని... లేకుంటే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దు: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details