తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా రంజాన్​ వేడుకలు - వరంగల్ అర్బన్ జిల్లా లాక్​డౌన్

లాక్​డౌన్​ నేపథ్యంలో.. రంజాన్​ పర్వదినాన ఈద్గాలు భక్తులు లేక వెలవెల బోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో పండుగ​ వేడకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు.

Ramadan celebrations
Ramadan celebrations

By

Published : May 14, 2021, 10:48 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రంజాన్ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ముస్లిం సోదరులు ఇంట్లోనే పిల్లాపాపలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.

రంజాన్ నాడు కిటకిటలాడే బొక్కలగడ్డ ఈద్గా.. భక్తులు లేక వెలవెల బోయింది. మరోవైపు.. ఈద్గాల వద్ద పోలీసులు విధులు నిర్వహించారు. పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో పేదలకు అండగా కేర్‌ అండ్‌ షేర్‌ ఫౌండేషన్‌

ABOUT THE AUTHOR

...view details