తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి : లక్ష్మీకాంతారావు - Warangal West MLA Vinay Bhaskar latest news

ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతారావు అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ ప్రగతియాత్ర రథాన్ని హన్మకొండలో జెండా ఊపి ప్రారంభించారు.

Captain Lakshmi Kantaravu launching the flag waving procession
జెండా ఊపి ప్రగతియాత్ర రథాన్ని ప్రారంభిస్తున్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు

By

Published : Jan 7, 2021, 5:30 PM IST

ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

అభివృద్ధి దిశగా..

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంక్షేమ ప్రగతియాత్ర రథాన్ని హన్మకొండలో జెండా ఊపి లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్​ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

వరంగల్​లో డివిజన్ల వారిగా ఇంటింటికెళ్లి వారికున్న సమస్యలపై దృష్టి సారింస్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఇందులో భాగంగా లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి ప్రజా సంక్షేమ ప్రగతియాత్ర ప్రారంభిస్తున్నాం.

-వినయ్​ భాస్కర్, ప్రభుత్వఛీప్ విప్

ఇదీ చూడండి:రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి

ABOUT THE AUTHOR

...view details