తెలంగాణ

telangana

ETV Bharat / state

Railway Wagon Manufacturing Unit : కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు.. నేడు భూమిపూజ

Railway Wagon Manufacturing Unit in Kazipet: ఇవాళ ప్రధాని మోదీ వరంగల్​ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక పెద్ద పరిశ్రమ శ్రీకారం చుట్టనున్నారు. కాజీపేటలోని 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్​ తయారీ పరిశ్రమకు ఇవాళ మోదీ ప్రారంభించనున్నారు. రూ.521 కోట్లతో మంజూరైన ఈ పరిశ్రమ దాదాపు 3,000 మందికి పైగ ఉద్యోగ అవకాశాలిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి తెలిపారు.

Wagon
Wagon

By

Published : Jul 8, 2023, 8:08 AM IST

Updated : Jul 8, 2023, 8:14 AM IST

కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ

Railway Wagon Manufacturing unit in Warangal : కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు.. మోదీ భూమిపూజ చేస్తున్నారు. రూ.521 కోట్ల వ్యయంతో.. చేపడతున్న ఈ యూనిట్‌లో ఏడాదికి 2,400 వ్యాగన్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వే తయారీ యూనిట్ రాకతో.. ఓరుగల్లుకు చాలా రోజుల తరువాత ఓ పరిశ్రమ వచ్చినట్లైంది. ఈ కర్మాగారం వల్ల స్థానికులకూ ఉపాధి అవకాశాలు రానున్నాయి.

విద్యా కేంద్రంగా పేరున్న ఓరుగల్లు కీలకమైన పరిశ్రమ రానుంది. కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని అయోధ్యాపురంలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ఇవాళప్రధాని మోదీ భూమి పూజ చేస్తారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ పరిశ్రమ ఏర్పాటుచేయాలని ఆందోళనలు జరిగినా.. ఆ స్థానంలో వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకే కేంద్రం మొగ్గు చూపింది. ఆ మేరకు వడివడిగా శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. వ్యాగన్ తయారీ నిర్మాణ బాధ్యతలను రైల్వే నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించారు.

Railway Wagon Manufacturing Unit in Kazipet : ఈ సంస్థ ఆధ్వర్యంలో 24 నెలల్లో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తారు. ప్రస్తుత వ్యయం రూ.521 కోట్లైనా..నిర్మాణం పూర్తయ్యే వరకూ..అది మరింత పెరగవచ్చు. ఇక వ్యాగన్ల ఆవశ్యకత కూడా చాలా ఉంది. దేశంలో 22,790 మెట్రిక్ టన్నుల సరకు రవాణాకు మాత్రమే వ్యాగన్లు ఉన్నాయి. మరో 7,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాకు ఇవి చాలా అవసరం. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో వ్యాగన్ల కొరత తీరుతుంది. మొదటి దశలో ఇతర ప్రాంతాల్లో పనిచేసే 1200 మంది రైల్వే ఉద్యోగులను బదిలీపై తీసుకు వస్తారు. పని పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రత్యేకంగా క్వార్టర్ల నిర్మాణం చేపడతారు. 3,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు ఉంటాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

"ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ వ్యాగన్​ పీరియాడిక్​ ఒరాలింగ్​ కాకుండా ముందుగా ఇక్కడ తయారీ సంస్థను పెట్టాలి. రూ.521 కోట్లతో వ్యయంతో పరిశ్రమను నిర్మిస్తున్నాం. ఇందుకు సంబంధించిన పనులు దశల వారిగా పూర్తి అవుతాయి. రైల్వేకు కావాల్సిన ఉత్పత్తులు,పరికరాలు ఇక్కడే తయారవుతాయి."-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి , బీజేపీ అధ్యక్షుడు

Modi Warangal Tour : వ్యాగన్ల తయారీలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. భారీ షెడ్లలో వ్యాగన్ల బరువు కొలిచే పై బ్రిడ్జి, బోగీలను తయారు చేసే కేంద్రం, చక్రాలను తయారుచేసేవి, విడిభాగాలన్నీ తయారయ్యాక బిగించే 'బాడీ అసెంబ్లీ షాప్ మొదలైనవి ఇక్కడ ఉంటాయ్. రోబో సాంకేతికతతో మనుషులు లేకుండా బోగీలకు రంగులు వేసే పెయింటింగ్ షెడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాగన్ల ఉత్పత్తి వల్ల సరుకు రవాణా వేగవంతమవుతుంది. ఇది వ్యవసాయానికి ఊతం ఇస్తుంది. సింగరేణి బొగ్గు, సిమెంట్ రవాణా కోసం త్వరగా రైళ్లను కేటాయించగలుగుతారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 8, 2023, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details