Rahul Gandhi Telangana Tour: హనుమకొండలో మే 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘రైతు సంఘర్షణ సభ’ను తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. చాలాకాలం తర్వాత రాష్ట్రానికి రాహుల్ వస్తున్న నేపథ్యంలో.. సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. బహిరంగసభకు 5లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవేదికగా ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంతోపాటు వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తోంది. ఈక్రమంలో జనసమీకరణ కోసం ముఖ్యనేతలు జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు.
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డిలు మంగళవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. 22న రేవంత్, స్టార్‌క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాస్కీ, ముఖ్య నాయకులు హనుమకొండలో బహిరంగ సభాస్థలిని పరిశీలిస్తారు. అదేరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 23న గాంధీభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జనసమీకరణ, బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించనున్నారు.
మహిళల్ని మోసం చేసిన తెరాస ప్రభుత్వం: భట్టి