తెలంగాణ

telangana

ETV Bharat / state

Rahul Gandhi Telangana Tour : రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఇదే - Rahul Gandhi Telangana Tour schedule updates

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్​ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్​ ఖరారైంది. ఇవాళ, రేపు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈరోజు వరంగల్​లో రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్న రాహుల్​.. రేపు గాంధీభవన్​లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్​ను ప్రకటించాయి.

rahul gandhi tour in telangana
తెలంగాణలో రాహుల్​ గాంధీ పర్యటన

By

Published : May 5, 2022, 10:50 AM IST

Updated : May 6, 2022, 6:17 AM IST

Rahul Gandhi Telangana Tour : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం రాహుల్ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10కి ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరతారు. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకుంటారు. 6:05గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 'రైతు సంఘర్షణ సభ'లో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్ ద్వారా రాత్రి 10:40కి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో బస చేస్తారు.

రేపు మధ్యాహ్నం 12:30కి తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50- 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్‌ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. పార్టీ నేతలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. అనంతరం మెంబర్‌షిప్‌ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్‌పోర్టుకు వెళతారు. 5:50 కి దిల్లీ తిరుగు పయనమవుతారు.

ముఖాముఖికి హైకోర్టు నో: కాగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్​ నిర్ణయించింది. కానీ అందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ముఖాముఖికి అనుమతిచ్చేలా ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలన్న ఎన్‌ఎస్‌యూఐ నేతల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఓయూ ఉత్తర్వుల్లో జోక్యం చేసేందుకు నిరాకరించింది. ఓయూ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మానవతరాయ్ సహా మరో ముగ్గురు ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్​పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఓయూ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇవీ చదవండి:ఎన్‌ఎస్‌యూఐ నేతలు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

జమ్మూ​, పాక్ మధ్య సొరంగం! వారి పనేనా?

Last Updated : May 6, 2022, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details