తెలంగాణ

telangana

ETV Bharat / state

COTTON: ఎనుమాముల మార్కెట్​లో రికార్డు ధర పలుకుతోన్న పత్తి ధర - telangana latest news

వరంగల్ వ్యవసాయ మార్కెట్​లో పత్తి రికార్డు ధరలు నమోదు చేస్తోంది. క్వింటాల్​ తెల్ల బంగారం ధర రూ.8,060 పలుకుతోంది. మరోవైపు పండించిన పంటకు మంచి ధర వస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

COTTON: ఎనుమాముల మార్కెట్​లో రికార్డు ధర పలుకుతోన్న పత్తి ధర
COTTON: ఎనుమాముల మార్కెట్​లో రికార్డు ధర పలుకుతోన్న పత్తి ధర

By

Published : Jul 29, 2021, 3:31 PM IST

ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్​గా పేరు గాంచిన వరంగల్ వ్యవసాయ మార్కెట్​లో పత్తి రికార్డు ధరలు నమోదు చేస్తోంది. మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో క్వింటాల్​ పత్తి ధర రూ.8,060 రూపాయలు నమోదైంది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో పత్తికి డిమాండ్ పెరగడం, బేళ్ల ధరలతో పాటు పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడటం వల్ల పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు.

కష్టానికి తగిన ఫలితం..

ఏదేమైనప్పటికీ తాము పండించిన పంటకు మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాము పడిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్​లోనూ పత్తికి ఇలాగే మంచి ధర పలికితే.. ఈ తెల్ల బంగారం సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో ధర పెరగడం బాధాకరమని రైతులు వాపోయారు.

గత నెలలో రూ.7 వేలు పలికిన తెల్ల బంగారం..

ఇదే వ్యవసాయ మార్కెట్​లో గత నెలలో పత్తి ధరలు క్వింటాల్​కు రూ.7 వేలు పలికాయి. గతేడాది రూ.6,500 దాటని తెల్ల బంగారం.. ఒక్కసారిగా రూ.7 వేలు ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఎనుమాముల మార్కెట్​లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు

ABOUT THE AUTHOR

...view details