తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండ చిలువకు 20 కుట్లతో చికిత్స - Python curing at janmakonda zoo

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని జంతుప్రదర్శనశాలలో గాయపడిన కొండచిలువ కోలుకుంటోంది. నాలుగురోజుల క్రితం గాయపడిన చిలువకు మొత్తం 20 కుట్లు వేశారు. పూర్తిగా కోలుకోవడానికి మరో పదిరోజులు పడుతుందని జూ వైద్యులు తెలిపారు.

python-curing-at-hanmakonda-zoo
సగానికిపైగా తెగిన కొండచిలువ... 20 కుట్లతో చికిత్స

By

Published : May 23, 2020, 1:10 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ జంతుప్రదర్శనశాలలో కొండ చిలువ కోలుకుంటోంది. జూ వైద్యులు శస్త్రచికిత్స చేసి గాయాలకు కట్టు కట్టారు. అర్బన్ జిల్లా హసన్​పర్తి చెరువులో నాలుగురోజుల క్రితం.. మత్స్యకారుల వలలో చిక్కుకుని కొండచిలువ తీవ్రగాయాల పాలైంది.

సగానికిపైగా తెగిన కొండచిలువ... 20 కుట్లతో చికిత్స

విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు.. దాన్ని జూకి తీసుకొచ్చారు. వలలో ఇరుక్కుపోవడం వల్ల సగానికిపైగా తెగిపోయింది. జూ వైద్యులు రేయింబవళ్లు శ్రమించి.. దానికి వైద్య చేశారు. మొత్తం 20 కుట్లు వేసి కట్టుకట్టారు. ఇప్పుడిప్పుడే కాస్త ప్రాణం వచ్చి కదులుతోందని.. పూర్తిగా కోలుకోవడానికి పదిరోజులు పడుతుందని జూ వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి:ఆటోడ్రైవర్​ చేసిన పెట్రోల్​ దాడిలో.. హెల్త్​వర్కర్​ మృతి

ABOUT THE AUTHOR

...view details