వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్.. హన్మకొండలోని పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని.. అపర చాణక్యుడంటూ కొనియాడారు. ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు.
హన్మకొండలో ఘనంగా పీవీ వర్ధంతి వేడుకలు - తెలుగు ప్రజల గౌరవం
మాజీ ప్రధాని పీవీ.. అపర చాణక్యుడిని కొనియాడారు ఎమ్మెల్యే సతీశ్. పీవీ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
హన్మకొండలో ఘనంగా పీవీ వర్ధంతి వేడుకలు
తెలుగు ప్రజల గౌరవాన్ని.. ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతమైన వ్యక్తి పీవీ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు దేశానికి గట్టి పునాదిలా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి విక్రమార్క