తెలంగాణ

telangana

ETV Bharat / state

Lockdown: సండే సందడి.. మార్కెట్లు, దుకాణాల వద్ద జనం కిటకిట

లాక్​డౌన్​ (Lockdown) మినహాయింపు సమయంలో నిత్యావసర దుకాణాలు, కూరగాయలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఉదయం పది లోపే అవసరమైనవన్నీ తీసుకోవాలనే ఉద్దేశంతో దుకాణాలకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో దుకాణాల వద్ద రద్దీ తీవ్రంగా ఏర్పడింది.

lockdown in warangal and hanmakonda
వరంగల్​, హన్మకొండలో లాక్​డౌన్​

By

Published : May 30, 2021, 9:42 AM IST

లాక్​డౌన్ (Lockdown) కారణంగా నిత్యావసర సరుకులు ముందే సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వరంగల్ నగర వాసులతో పలు దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హన్మకొండలోని పలు దుకాణాలను ఉదయాన్నే తెరిచారు.

ఆదివారం కావడంతో కుమారపల్లి కూరగాయల మార్కెట్​కు జనాలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మాంసం దుకాణాల వద్ద మాంసప్రియులు బారులు తీరారు. కొవిడ్ నియమాలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళనకు దారితీస్తోంది.

ఇదీ చదవండి:పాతబస్తీలో ఉద్రిక్తత.. పోలీసులతో యువకుల వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details