రాష్ట్రంలో షీ టీమ్‌ల బలోపేతానికి మంజూరు చేసిన ద్విచక్రవాహనాలను వరంగల్‌లో సీపీ ప్రమోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్‌లపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీపీ పేర్కొన్నారు.
షీటీమ్లపై ప్రజలకు నమ్మకం పెరిగింది: సీపీ ప్రమోద్‌కుమార్ - Telangana news
షీ టీమ్‌లకు మంజూరు చేసిన నూతన ద్విచక్ర వాహనాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. షీ టీమ్‌లపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీపీ పేర్కొన్నారు.

షీటీమ్లపై ప్రజలకు నమ్మకం పెరిగింది: సీపీ ప్రమోద్‌కుమార్
గత రెండేళ్లలో కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న 43 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. 290 కేసులు నమోదు చేయగా, 280 మందిని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. నూతన వాహనాలను సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో పరిరక్షించుకోవాలని సీపీ ప్రమోద్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండి:కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి