వరంగల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ హన్మకొండ బస్టాండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. వీరికి పీఆర్టీయూ, ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపాయి. భారీ ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ సమ్మెకు పీఆర్టీయూ, ఎంఆర్పీఎస్ మద్దతు - prtu and mrps support to rtc strick in warangal
ఆర్టీసీకి మద్దతు పెరుగుతోంది. సమ్మెకు పీఆర్టీయూ, ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించాయి. విపక్షాలు, పలు సంఘాల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్ధృతం చేశారు.
ఆర్టీసీ సమ్మె