వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నాకు దిగారు. పరిపాలనా భవనం ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్, పాలక మండలి సభ్యులు.. విద్యార్థులతో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించారు. లైబ్రరీలోని సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
గ్రంథాలయంలో మౌలిక సౌకర్యాల కోసం ధర్నా - కాకతీయ యూనివర్సిటీ వార్తలు
కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కనీసం మంచినీటి సదుపాయమూ లేదని వాపోయారు. నూతన పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
గ్రంథాలయంలో మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
లైబ్రరీలో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదని.. శుభ్రం చేయడం లేదని విద్యార్థులు తెలిపారు. నిర్ణీత సమయం కంటే ముందే మూసివేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పోటీ పరీక్షలను సంబంధించిన నూతన పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రీడింగ్ హాల్ ఇంతవరకు ఎందుకు ఓపెన్ చేయలేదని ప్రశ్నించారు. ఈ ఆందోళనలో పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం