ఇద్దరు ఎంపీలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకొనే సీఎం కేసీఆర్.. ఇప్పుడింత మంది ఎంపీలున్నప్పటకీ, కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు తీసుకురాలేకపోతున్నారో తెలపాలని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో.. ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్టీ నేతలతో ఆందోళన నిర్వహించారు.
'భాజాపా.. విభజన చట్ట హమీలను విస్మరించింది'
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి కాజీపేట్‌లో ఆందోళన నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి రైల్వే స్టేషన్ ఎదుట బైఠాయించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'భాజాపా.. విభజన చట్ట హమీలను విస్మరించింది'
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని జంగా రాఘవ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో.. కోచ్ ఫ్యాక్టరీపై ఇచ్చిన హమీలను, భాజాపా విస్మరించిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రైల్వే స్టేషన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక