తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రొఫెసర్​ను ప్రతీ ఒక్కరూ.. ఆదర్శంగా తీసుకోవాలి - ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ఆచార్య కొత్తపల్లి జయశంకర్​ను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్​ అర్బన్ జిల్లా ప్రజాప్రతినిధులు కొనియాడారు. జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఆదర్శంగా తీసుకోవాలి

By

Published : Aug 6, 2019, 12:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ప్రొఫెసర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మేయర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ రాష్ట్రానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు.

ప్రతీ ఒక్కరూ.. ఆదర్శంగా తీసుకోవాలి

ABOUT THE AUTHOR

...view details