రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న తెలంగాణ ఆర్థిక సంఘ నాల్గో సదస్సుకు హరగోపాల్ హాజరయ్యారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం తీసుకువస్తుందని మండిపడ్డారు. ఈ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి తీసుకోవాలి'
కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఆర్థిక సంఘ నాల్గొ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
PROFESSOR HARAGOPAL COMMENT ON PRIVATE UNIVERSITIES IN TELANAGANA
నీటిపారుదల ప్రాజెక్టులపై పెడుతున్న శ్రద్ధ విద్యాపై పెట్టడం లేదని హరగోపాల్ ఆరోపించారు. ఉన్న విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయకపోగా... ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువస్తాననటం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:శంషాబాద్లో 1100 గ్రాముల బంగారం పట్టివేత