వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం పోలీస్‌స్టేషన్‌లో ప్రొఫెసర్ కాసింపై కేసు నమోదైంది. అయితే ఆ కేసు విషయంలో పీటీ వారెంట్‌పై చర్లపల్లి జైలు నుంచి వరంగల్ అర్బన్ జిల్లా కోర్టుకు తీసుకురాగా... కోర్టులో అస్వస్థతకు గురై సృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రొఫెసర్ కాసింను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుమారు 3 గంటలపాటు బందోబస్తు మధ్య చికిత్స అందించారు.
కోర్టులో స్పృహతప్పి పడిపోయిన ప్రొఫెసర్ కాసిం - osmania university associate professor Kaseem news
ప్రొఫెసర్ కాసింను వరంగల్ అర్బన్ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఆయన స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కోర్టులో సృహతప్పి పడిపోయిన ప్రొఫెసర్ కాసిం
కొంత కుదుటపడ్డాక ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు ఈనెల 25కు వాయిదా పడింది. ప్రొఫెసర్ కాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- ఇదీ చూడండి :మనిషి తలను కుక్క ఎత్తుకెళ్లింది