కరోనా వల్ల ఏడు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలో ఏకశిలా పార్కు ముందు ఆకలి కేకల దీక్ష పేరిట ఆందోళన చేపట్టారు.
హనుమకొండలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆకలి దీక్ష - వరంగల్ అర్బన్ జిల్లా సమాచారం
వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలో ప్రైవేట్ ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. కరోనా వల్ల ఏడు నెలల నుంచి జీతాల్లేక అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
Breaking News
కొంతమంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. జీతాల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పస్తులు ఉంటూ అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్లదీస్తున్నామని తెలిపారు.