వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోన సాకుతో వారి పొట్టకొడుతోందన్నారు.
కరోనా సాకుతో.. మా పొట్ట కొట్టొద్దు - school teachers protest
పాఠశాలలు తిరిగి ప్రారంభించాలంటూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
![కరోనా సాకుతో.. మా పొట్ట కొట్టొద్దు private teachers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11178710-673-11178710-1616828764752.jpg)
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విద్యాసంస్థలను తెరిచి.. ఎన్నికలు ముగిశాక మళ్లీ మూసివేశారని ఆరోపించారు. బార్లు, సినిమాహాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా విద్యా సంస్థల్లోనే వస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్కూల్స్‌ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!