తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపాధ్యాయ వృత్తి చేపట్టడమే పాపమా?' - Private teachers protesting

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలని వరంగల్‌లో... టీచర్‌లు ఆందోళన నిర్వహించారు. బార్లు, సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తెరిస్తే వస్తోందా అని ప్రశ్నించారు. బట్టల బజార్ నుంచి ఎండీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Private teachers protesting
నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రైవేటు టీచర్‌లు

By

Published : Apr 7, 2021, 2:14 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రమే బడులు ప్రారంభించి... తర్వాత మూసివేశారని వరంగల్ అర్బన్‌ జిల్లా ప్రైవేటు ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇప్పటికే కరోనా వల్ల జీతాల్లేక అల్లాడుతోంటే.. మళ్లీ ఇప్పుడు పాఠశాలలు మూసివేశారని వాపోయారు. బార్లు, సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తెరిస్తే వస్తోందా అని ప్రశ్నించారు. పాఠాలు లేకుండా ప్రమోట్ చేయటం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.

కరోనా సాకుతో తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ భవిష్యత్ గురించి ఆలోచన చేయాలన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు గురుదక్షిణ కింద నెలకు రూ. 10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:మావోల బందీలో ఉన్న జవాన్​ ఫొటో విడుదల!

ABOUT THE AUTHOR

...view details