వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి పరారైన రిమాండ్ ఖైదీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హన్మకొండకు చెందిన సయ్యద్ ఖైసర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని సుబేదారి పోలీసులు పట్టుకుని 30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆసుపత్రి నుంచి కరోనా ఖైదీ పరార్.. గాలిస్తున్న పోలీసులు - Warangal M. G. M. hospital
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఓ కరోనా సోకిన ఖైదీ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఆసుపత్రి నుంచి కరోనా వచ్చిన ఖైదీ పరార్.. గాలిస్తోన్న పోలీసులు
మూడు రోజుల క్రితం కోర్టులో హాజరుపరిచిన నిందితున్ని జైలుకు తరలించగా కొవిడ్ లక్షణాలు ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సయ్యద్ ఖైసర్ భోజన సమయంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?