ఓ నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అనుసంధానంగా నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రిన్సిపాల్ సతీష్ కుమారి రూ. 60 వేలు డిమాండ్ చేసింది.
స్టూడెంట్ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్ - warangal urban district today news
ఓ విద్యార్థిని నుంచి 40 వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారో ప్రిన్సిపాల్. ఈ ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది.
స్టూడెంట్ నుంచి లంచం తీసుకున్న ప్రిన్సిపాల్
లంచం ఇవ్వడం ఇష్టంలేని విద్యార్థిని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో విద్యార్థిని 40 వేల రూపాయలు ఇస్తున్న క్రమంలో అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రిన్సిపల్, మరో ఇద్దరు ట్యూటర్లు శారద, శోభను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి :తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?