తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2023, 10:57 AM IST

Updated : Jul 8, 2023, 12:47 PM IST

ETV Bharat / state

PM Modi Warangal Tour Live Updates : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్‌ సర్కారు పని: మోదీ

PM Modi Warangal Tour
PM Modi Warangal Tour

12:26 July 08

  • భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమను తెలుగులో స్మరించుకున్న మోదీ
  • సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి ప్రతీకలు: నరేంద్ర మోదీ
  • రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామాఅయిన వరంగల్‌కు రావడం సంతోషకరం: మోదీ
  • మున్సిపల్‌ సంస్థ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది: మోదీ
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ పత్తా లేకుండా చేస్తాం: మోదీ
  • బీజేపీ తొలిసారి సాధించిన 2 ఎంపీ సీట్లలో ఒకటి హనుమకొండ: మోదీ
  • దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది: మోదీ
  • ఆత్మనిర్భర భారత్‌లోనూ తెలంగాణది ప్రధాన భూమిక: మోదీ
  • వ్యాక్సీన్ల తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది: మోదీ
  • తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి: ప్రధాని మోదీ
  • పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి: మోదీ
  • కేంద్రం ఇన్ని చేస్తుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోంది: మోదీ
  • కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది: మోదీ
  • కేసీఆర్‌ ప్రభుత్వం..అత్యంత అవినీతి ప్రభుత్వం: మోదీ
  • కేసీఆర్‌ సర్కారు అవినీతి దిల్లీ వరకూ పాకింది: మోదీ
  • అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలసి పని చేస్తుంటాయి: మోదీ
  • తొలిసారిగా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం: మోదీ
  • ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసింది: మోదీ
  • కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్‌ సర్కారు పని: మోదీ
  • ఇలాంటి కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదు: మోదీ
  • కాంగ్రెస్‌ అవినీతి పాలనను దేశమంతా చూసింది: మోదీ
  • కేసీఆర్‌ అవినీతి పాలనను తెలంగాణ చూసింది: మోదీ
  • కేసీఆర్‌ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసింది: మోదీ
  • కేసీఆర్‌ ప్రభుత్వం.. యువతను మోసం చేసింది: మోదీ
  • కేసీఆర్‌.. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారు: మోదీ
  • టీఎస్‌పీఎస్‌సీ స్కామ్‌ ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం యువతను మోసం చేసింది: మోదీ
  • తెలంగాణ వర్శిటీలలో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మోదీ
  • పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మోదీ
  • పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేశారు: మోదీ
  • రాష్ట్రప్రభుత్వంపై సర్పంచ్‌లు అందరూ ఆగ్రహంగా ఉన్నారు: మోదీ
  • గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోంది: మోదీ
  • తొమ్మిదేళ్లలో కేంద్రం పంచాయతీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చింది: మోదీ
  • మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చాం.. చేసి చూపించాం: మోదీ
  • తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇచ్చాం: ప్రధాని మోదీ
  • ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది: మోదీ
  • ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు: మోదీ
  • మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నాం: మోదీ

12:16 July 08

  • మోదీ.. వరల్డ్ పాపులర్‌ లీడర్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నేత మోదీ: కిషన్‌రెడ్డి
  • 30 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు వచ్చిన ప్రధాని.. మోదీ: కిషన్‌రెడ్డి
  • వర్షం ఉన్నా.. సభకు గ్రామాల నుంచి జనం తరలివచ్చారు: కిషన్‌రెడ్డి
  • ప్రధాని కార్యక్రమాన్ని అధికార పార్టీ బహిష్కరించింది: కిషన్‌రెడ్డి
  • ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో భారాస నేతలు చెప్పాలి: కిషన్‌రెడ్డి
  • రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తున్నందుకు బహిష్కరిస్తున్నారా?: కిషన్‌రెడ్డి
  • రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా?: కిషన్‌రెడ్డి
  • ఈ రాష్ట్రంలో ముందుగా బహిష్కరించాల్సింది.. కల్వకుంట్ల కుటుంబాన్నే: కిషన్‌రెడ్డి
  • హమీలు ఇచ్చి తప్పినందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి: కిషన్‌రెడ్డి
  • పేపర్‌ లీకేజీ ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినందుకు యువత బహిష్కరించబోతోంది
  • ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు: కిషన్‌రెడ్డి
  • రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు: కిషన్‌రెడ్డి
  • కేసీఆర్‌ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసే రోజు ఎంతో దూరంలో లేదు: కిషన్‌రెడ్డి
  • బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌, బీఆర్ఎస్​లకు పొత్తు పెట్టుకున్న చరిత్ర ఉంది: కిషన్‌రెడ్డి
  • బీజేపీ.. ఎప్పటికీ బీఆర్ఎస్​తో కలవదు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్.. కుటుంబ, అవినీతి పార్టీలు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏ ఒక్కటే.. వీటికి భవిష్యత్‌ ఉండకూడదు: కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్‌, బీఆర్ఎస్​కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్టే : కిషన్‌రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్​.. ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయి: కిషన్‌రెడ్డి
  • బీజేపీ అధికారంలోకి రాకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు: కిషన్‌రెడ్డి
  • బీజేపీ అధికారంలోకి రాకుంటే.. సంక్షేమ పథకాలు అమలు కావు: కిషన్‌రెడ్డి

12:04 July 08

  • ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత నరేంద్ర మోదీ: బండి సంజయ్‌
  • ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ: బండి సంజయ్‌
  • రూ.6 వేల కోట్ల పనులను ప్రారంభించిన మోదీకి ధన్యవాదాలు: బండి సంజయ్‌
  • కరీంనగర్‌ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు: బండి సంజయ్‌
  • కరీంనగర్‌ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు: బండి సంజయ్‌
  • ఏం ముఖం పెట్టుకుని మోదీ వస్తారని కొందరు ప్రశ్నించారు: బండి సంజయ్‌
  • 10 వేల మంది వరకు ఉపాధి కల్పించేందుకు మోదీ వచ్చారు: సంజయ్‌
  • వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చారు: బండి సంజయ్‌
  • ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు: బండి సంజయ్‌
  • మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్‌ వస్తుంది.. జ్వరం వస్తుంది: బండి సంజయ్‌
  • పార్టీ నాకు అనేక అవకాశాలు కల్పించింది: బండి సంజయ్‌
  • రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవి సహా ఎన్నో అవకాశాలు కల్పించింది: బండి సంజయ్‌
  • ప్రధాని నా భుజం తట్టారు.. ఇంతకు మించి ఇంకేం కావాలి: బండి సంజయ్‌
  • కిషన్‌ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్‌ గడీలు బద్దలు కొడతాం: బండి సంజయ్‌
  • తెలంగాణలో కాషాయరాజ్యం తెచ్చేందుకు అంతా కృషి చేయాలి: బండి సంజయ్‌

11:58 July 08

  • ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచికం: ఈటల
  • వరంగల్‌ గడ్డ మీద రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టాం: ఈటల
  • తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకు మోదీ వచ్చారు: ఈటల
  • కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు: ఈటల
  • హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలి: ఈటల
  • బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు: ఈటల
  • బంగారు తెలంగాణ చేతల్లో చేసే చూపించే సత్తా బీజేపీకే ఉంది: ఈటల

11:40 July 08

  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు: మోదీ
  • తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయింది: మోదీ
  • దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: మోదీ
  • ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక: మోదీ
  • దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారింది: మోదీ
  • దేశానికి ఇది స్వర్ణ సమయం: మోదీ
  • రూ. 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం: మోదీ
  • దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం: మోదీ
  • అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం: మోదీ
  • హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం: మోదీ
  • తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి
  • కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది
  • రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం
  • తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం
  • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది

11:28 July 08

  • కేంద్రం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది: గడ్కరీ
  • గతిశక్తి యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం: గడ్కరీ
  • తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాం: గడ్కరీ
  • 2024 నాటికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: గడ్కరీ
  • ఉత్తరాది, దక్షిణాదిని అనుసంధానిస్తూ రహదారులు: గడ్కరీ
  • సూరత్‌ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కర్నూలు మీదుగా రహదారి: గడ్కరీ
  • ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించాలి: గడ్కరీ
  • పట్టణాలకు రహదారుల ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: గడ్కరీ
  • మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ మంచి రహదారులు వేశాం: గడ్కరీ

11:23 July 08

  • బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తోంది: కిషన్‌రెడ్డి
  • మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు మెరుగయ్యాయి: కిషన్‌రెడ్డి
  • రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది: కిషన్‌రెడ్డి
  • రూ. 720 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధిపనులు చేపట్టాం: కిషన్‌రెడ్డి
  • రూ.1900 కోట్లతో హైదరాబాద్‌- వరంగల్‌ రహదారిని మంజూరు చేశాం: కిషన్‌రెడ్డి
  • ఇవాళ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నాం: కిషన్‌రెడ్డి
  • రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తాయి: కిషన్‌రెడ్డి

11:05 July 08

  • భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు బయల్దేరిన మోదీ
  • సభకు హాజరైన గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి గడ్కరీ

11:04 July 08

  • హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బీజేపీ సభ సందడి
  • హనుమకొండ: సభకు హాజరైన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు
  • హనుమకొండ: సభలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • సభాప్రాంగణం నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

11:00 July 08

  • వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ఆర్చకులు
  • ఆలయ ఆవరణలో గోశాలలో గో సేవలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని
  • ప్రత్యేక పూజల తర్వాత మోదీకి వేదపండితుల ఆశీర్వచనం
  • భద్రకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని మోదీ
  • కాసేపట్లో భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు ప్రధాని

11:00 July 08

  • మామునూరుకు చేరుకున్న ప్రధాని మోదీ
  • హకీంపేట నుంచి హెలికాప్టర్‌లో మామునూరుకు చేరుకున్న మోదీ
  • ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, జిల్లా అధికారులు
  • మామునూరు నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లనున్న ప్రధాని
  • భద్రకాళి ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ
  • భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ
  • భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు ప్రధాని మోదీ
  • హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయసంకల్ప సభ
  • వరంగల్‌లో రూ.6109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
  • కాజీపేట: రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగారానికి మోదీ శంకుస్థాపన
  • రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఎన్‌హెచ్‌ పనులకు శంకుస్థాపన
  • రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ ఎన్‌హెచ్‌ పనులకు శంకుస్థాపన

10:39 July 08

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

  • మామునూరుకు చేరుకున్న ప్రధాని మోదీ
  • హకీంపేట నుంచి హెలికాప్టర్‌లో మామునూరుకు చేరుకున్న మోదీ
  • మామునూరు నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లనున్న ప్రధాని
  • భద్రకాళి ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్న ప్రధాని
Last Updated : Jul 8, 2023, 12:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details