ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖిలా వరంగల్లో భాజపా శ్రేణులు మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అంతకు ముందు కాశిబుగ్గలోని అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం భాజపా శ్రేణులు ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధిలో రక్తదానం చేశారు.
వరంగల్లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు - prime minister modi birthday celebrations
వరంగల్లో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు.

వరంగల్లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు