తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రీతిది హత్యే.. పోలీసుల నుంచి టాక్సికాలజీ రిపోర్టు అందలేదు: ప్రీతి తండ్రి - డీజీపీ ఆఫీస్​కు వెళ్లిన ప్రీతి కుటుంబసభ్యులు

Preethi Family Member Meets DGP: ప్రీతి మృతి ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందో పోలీసులే చెప్పాలని ఆమె తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. విచారణ సక్రమంగా జరిపిస్తామని అదనపు డీజీపీ చెప్పారన్నారు. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టు ఇప్పటి వరకు తమకు చూపించలేదని వాపోయారు. మరోవైపు నిందితుడు సైఫ్​ నాలుగురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది.

Preethi Family Members
Preethi Family Members

By

Published : Mar 6, 2023, 4:27 PM IST

Preethi Family Members Meets DGP: ఇటీవల మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని... హత్య చేశారని ఆమె తండ్రి నరేందర్ మరోసారి ఆరోపించారు. పోలీసుల నుంచి తమకెలాంటి టాక్సికాలజీ రిపోర్టు అందలేదని తెలిపారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఈరోజు ప్రతీ కుటుంబ సభ్యులు హైదరాబాద్​లో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వారు.. డీజీపీ లేకపోవడంతో అదనపు డీజీపీని కలిశారు.

నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని అదనపు డీజీపీని కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు. అదివారం వరంగల్​లోని మట్టెవాడ పోలీసులు తమ ఇంటికి వచ్చి మరోసారి వాంగ్మూలం నమోదు చేశారని తెలిపారు. టాక్సికాలజీ రిపోర్టు వచ్చినా కాజ్‌ ఆఫ్ డెత్ క్లియర్​గా తెలియదన్నారు. టాక్సికాలజీ కోసం రక్త నమూనాలను ఎంజీఎంలో కాకుండా.. నిమ్స్​లో తీసుకున్నారని అందువల్ల సరైన రిపోర్టు రాదని డాక్టర్లు చెప్పారన్నారు.

'ప్రీతి మృతి ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందో పోలీసులే చెప్పాలి. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టు మాకు ఇప్పటివరకు చూపలేదు. టాక్సికాలజీ సున్నా వచ్చినట్టు మీడియాలో చూశాం. ఘటన జరిగిన రోజు ప్రీతి నమూనాలు తీసుకోలేదు. ఎంజీఎంలోనే నమూనాలు తీసుకొని ఉంటే మృతికి కారణం తెలిసేది. నిమ్స్‌కు తీసుకొచ్చాక చికిత్స జరిగాక శాంపిల్‌ తీశారు. మేం వెళ్లినప్పుడు డీజీపీ ఆఫీసులో లేరు. విచారణ సక్రమంగా జరిపిస్తామని అదనపు డీజీపీ చెప్పారు.'-నరేందర్, ప్రీతి తండ్రి

పీజీ వైద్య విద్యార్ధి ప్రీతి మృతి కేసులో విచారణపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన వారు అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్​కి వినతిపత్రం ఇచ్చారు. సోదరి మృతిపై మరికొందరి మీదా అనుమానాలు ఉన్నాయని ప్రీతి సోదరుడు పృథ్వీ అంటున్నారు. ప్రీతి చావుకి కారణం వెల్లడించడంలో జాప్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దోషులను కఠినంగా శక్షించి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు.

సైఫ్​కు ముగిసిన పోలీస్ కస్టడీ:మరోవైపు ప్రీతి కేసులో... నిందితుడు సైఫ్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితుడ్ని ఇవాళ వరంగల్ న్యాయస్ధానంలో హాజరుపరిచిన పోలీసులు... మరిన్ని విషయాలు విచారించాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలంటూ... పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది. అనంతరం సైఫ్​ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు. ఇప్పటి వరకూ నాలుగు రోజుల విచారణలో భాగంగా... సైఫ్ వేధింపులపై లోతైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ప్రీతిని లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరగడానికి కారణాలేమిటంటూ... ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టారు. సైఫ్​ని కేఎంసీ, ఎంజీఎంలకు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. సాంకేతికపరమైన సమాచారాన్ని సేకరించారు.

ఇక ప్రీతి చనిపోయి వారం దాటినా... ఆమెది హత్య, అత్మహత్య అన్న మిస్టరీ వీడలేదు. ప్రీతి ఆత్మహత్య చేసుకుందని... పోలీసులు తొలుత నిర్ధారించినా... దీనికి సంబంధించి టాక్సాలజీ నివేదికలో... మృతురాలి శరీరంలో ఎలాంటి మత్తు మందుల అవశేషాలు, రసాయనాలు లేవని తేలినట్లు సమాచారం. దీంతో ప్రీతి ఎలా చనిపోయిందన్నదీ... మిస్టరీగా మారుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ప్రీతిది హత్యే.. పోలీసుల నుంచి టాక్సికాలజీ రిపోర్టు అందలేదు: ప్రీతి తండ్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details