తెలంగాణ

telangana

ETV Bharat / state

వినయభాస్కర్ క్యాంప్ ఆఫీస్​లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు - వరంగల్ వర్తలు

ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే వినయభాస్కర్ క్యాంప్ ఆఫీస్​లో ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే కేక్​ తినిపించారు.

Pre-Christmas Celebrations at Vinayabhaskar Camp Office
వినయభాస్కర్ క్యాంప్ ఆఫీస్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 23, 2020, 5:05 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయభాస్కర్ క్యాంప్ ఆఫీస్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వినయభాస్కర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేశారు.

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్​ తినిపించారు. క్రైస్తవుల సంక్షేమ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ABOUT THE AUTHOR

...view details