తెలంగాణ

telangana

ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం పాదయాత్ర

By

Published : Jan 21, 2021, 3:03 PM IST

హన్మకొండకు చెందిన ప్రకాశ్​ పర్యావరణ ప్రేమికుడు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడాకాన్ని చూస్తూ ఆవేదన చెందాడు. ప్లాస్టిక్ నిషేధానికి నేను సైతం అంటూ నడుం బిగించాడు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని పాదయాత్ర చేపట్టాడు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని భక్తులను కోరుతున్నాడు.

Hike to celebrate Medaram Fair Plastic Free
మేడారం జాతర ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని పాదయాత్ర

మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని కోరుతూ హన్మకొండకు చెందిన ప్రకాశ్ మేడారం వరకు పాదయాత్ర చేపట్టాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ సంరక్షణ అధికారి అక్బర్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు.

అవగాహన కోసమే..

జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ పర్యవరణాన్ని కాలుష్యం చేస్తున్నారని ప్రకాశ్​ ఆవేదన వ్యక్తం చేశాడు. మేడారం వచ్చే వారు ప్లాస్టిక్ బదులు బట్ట సంచులు, పేపర్ ప్లేట్స్, గ్లాసులు వాడాలని కోరారు.

పాదయాత్ర

ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే పాదయాత్ర చేపట్టానని పర్యావరణ ప్రేమికుడు తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించాడు.

ఇదీ చూడండి:కాలువల నుంచి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు..!

ABOUT THE AUTHOR

...view details